
హీరోగా నిలబడాలంటే కొత్తగా ప్రయత్నించాల్సిందే.. రొటీన్ కు భిన్నంగా కొద్దిమంది ప్రేక్షకులనే అలరించినా వారికి తగిన క్రేజ్ ఉంటుంది. అలాంటి వారిలో అడివి శేష్ ఒకరు. క్షణం సినిమా తర్వాత అతను గూఢచారిగా వస్తున్నాడు. ఈరోజు రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై అందరికి పాజిటివ్ ఒపీనియన్ ఉంది. టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.
ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కోనా వెంకట్ అడివి శేష్ ఆంధ్రా ఆమీర్ ఖాన్ అని పొగడటం సంచలనంగా మారింది. గూఢచారి సినిమా తన స్నేహితుడు చూసి ఈ సినిమా తప్పక విజయం సాధిస్తుందని అన్నారు. అదే విషయాన్ని ప్రస్థావిస్తూ గూఢచారి మరోసారి తెలుగు సినిమా స్టామినా చూపిస్తుందని.. ఈ సినిమాని తాను విజిటింగ్ కార్డ్ గా వాడేస్తా అంటున్నాడు. అంతేకాదు డిఫరెంట్ గా ప్రయత్నిస్తున్న అడివి శేష్ ను ఆంధ్రా ఆమీర్ ఖాన్ అనేశాడు కోనా వెంకట్. మరి కోనా మాటలకు స్టార్ ఫ్యాన్స్ ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.