కళ్యాణం.. కమనీయం.. శ్రీనివాస కళ్యాణం ట్రైలర్..!

నితిన్ హీరోగా సతీష్ వేగేశ్న డైరక్షన్ లో వస్తున్న సినిమా శ్రీనివాస కళ్యాణం. రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పెళ్లి విశిష్టతను తెలియచెప్పే సినిమాగా వస్తుంది. నితిన్, రాశి ఖన్నాల జోడి బాగుంది. ముఖ్యంగా సినిమాలో మిక్కి జే మేయర్ మ్యూజిక్ సినిమాకు ప్రధాన బలమని తెలుస్తుంది. సినిమాలో కళ్యాణం కమనీయం సాంగ్ ఇప్పటికే పెద్ద హిట్ అయ్యింది.


ఆగష్టు 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. జీవితంలో ఒక్కసారి వచ్చే పండుగే పెళ్లి అంటూ జయసుధ పెళ్లి గురించి చెబుతుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమాగా కుటుంబకథా చిత్రంగా ఈ సినిమా రాబోతుంది. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.