'సభకు నమస్కారం' టైటిల్ తో బన్ని..!

నా పేరు సూర్య తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేయబోయే సినిమా ఏంటని పెద్ద కన్ ఫ్యూజన్ మొదలైంది. విక్రం కుమార్ తో సినిమా అనుకున్నా ఆ సినిమా అనుకున్న రేంజ్ లో వర్క్ అవుట్ అవదని భావిస్తున్నాడట బన్ని. అందుకే వేరే కథల వేటలో పడ్డాడట. ఇక ఈమధ్యనే దిల్ రాజు తన దగ్గరకు వచ్చిన ఓ కథను బన్నికి వినిపించాడట. కథ బన్నికి బాగా నచ్చేసిందట.  

సినిమా టైటిల్ గా సభకు నమస్కారం అని పెట్టాలని నిర్ణయించారట. దర్శకుడు ఒక్కడు ఫిక్స్ అయితే బన్ని నెక్స్ట్ మూవీ ఇదే అని అంటున్నారు. ఇలాంటి టైంలో హరీష్ శంకర్ ముందు గుర్తుకొస్తాడు. అయితే ఈమధ్యనే దిల్ రాజుతో తెగదెంపులు చేసుకుని హరీష్ శంకర్ బయటకు వచ్చాడు. ఈ కథకు ఎవరు దర్శకుడు అవుతాడో చూడాలి. సినిమా టైటిల్ గా బయటకు వచ్చిన సభకు నమస్కారం మాత్రం ఆడియెన్స్ లో క్యూరియాసిటీని పెంచింది.