
అక్కినేని వారసుడు నాగ చైతన్య హీరోగా సినిమాలైతే చేస్తున్నాడు కాని తన రేంజ్ కు తగినట్టుగా ఫలితాలు అందుకోవట్లేదు అన్నది వాస్తవం. రారండోయ్ వేడుక చూద్దాం సినిమా హిట్ అందుకున్న చైతు ఆ తర్వాత యుద్ధం శరణంతో ఫ్లాప్ చవిచూశాడు. లేటెస్ట్ గా మారుతి డైరక్షన్ లో శైలజా రెడ్డి అల్లుడు సినిమా చేస్తున్నాడు నాగ చైతన్య. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు.
చైతు సరసన అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో శైలజా రెడ్డిగా రమ్యకృష్ణ నటిస్తుండటం విశేషం. టైటిల్ లోనే కాదు సినిమాలో కూడా ఆమె చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమా చైతు కెరియర్ లో హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఆంధ్రాలో 9, నైజాం 6.5, సీడెడ్ 35, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ ఇలా అన్ని ఏరియాలు కలిపి చైతు కెరియర్ లో ఎన్నడు లేని విధంగా 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో దూసుకెళ్తుంది. మరి ఈ సినిమా రిలీజ్ తర్వాత హంగామా ఎలా ఉంటుందో చూడాలి.