
మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా చేస్తున్న సినిమా సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో వస్తుంది. సినిమాలో బిగ్ బి అమితాబ్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, సుదీప్ లు నటిస్తున్నట్టు తెలిసిందే. ఇప్పటికే అమితాబ్ నరసింహారెడ్డి గురువు పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. ఇక లేటెస్ట్ గా తమిళ నటుడు విజయ్ సేతుపతి పాత్ర కూడా రివీల్ అయ్యింది.
బ్రిటీష్ వారిని గడగడలాడించిన ఉయ్యాల నరసింహారెడ్డి తమిళులు, తెలుగు వారిని ఒక్కతాటిపై నడిపించాడు. ఇక సినిమాలో తాను తమిళ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా కనిపిస్తాడట. తెలుగు, తమిళ భాషల్ని కలిపి మాట్లాడే పాత్రలో విజయ్ కనిపిస్తాడట. పిజ్జా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన విజయ్ సేతుపతి తెలుగులో చేస్తున్న స్ట్రైట్ మూవీ ఇదే అని చెప్పాలి. తమిళంలో మాత్రం అతని నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.