
విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం డైరక్షన్ లో వస్తున్న సినిమా గీతా గోవిందం. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్ని వాసు నిర్మిస్తున్న ఈ సినిమా ఆడియో ఆదివారం సాయంత్రం జరిగింది. బన్ని చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఈ ఆడియో వేడుకలో హీరోయిన్ రష్మిక తను మాట్లాడే వరకు రౌడీ (విజయ్), బన్ని అని కేకలు వేస్తే యాసిడ్ పోస్తా అని సినిమాలో డైలాగ్ చెప్పి సందడి చేసింది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికకు రాసిపెట్టి ఉందని డైరక్టర్ పరశురాం అన్నారు. బన్ని మాటల ప్రస్థావనలో కూడా హీరోయిన్ పాత్రకు తాను వేరే వాళ్లను రిఫర్ చేస్తే వారు కాదన్నారని అన్నారు. ఇంతకీ గీత పాత్రని వారు కాదనడానికి అందులో ఏముంది అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. లక్కీగా ఛలో భామ రష్మికకు ఈ ఆఫర్ వచ్చింది. మొదటి సినిమా అలరించిన ఈ అమ్మడు విజయ్ తో జతకట్టే ఛాన్స్ రావడం కెరియర్ కు ఎంతో సపోర్ట్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. మరి ఈ గీత పాత్ర ఆడియెన్స్ ను ఎలా థ్రిల్ చేస్తుందో చూడాలి.