
బిగ్ బాస్ హౌజ్ లో ఆల్రెడీ ఎలిమినేట్ అయిన నూతన్ నాయుడు, శ్యామలాలు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. నాని హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సెకండ్ సీజన్ మొదటి నుండి అంత ఆసక్తి కలిగించడం లేదు. లాస్ట్ వీక్ ఎప్పటిలానే నామినేషన్ ప్రక్రియ చేయగా నిన్న మాత్రం నాని ఈ వారం ఎలిమినేషన్ లేదని హౌజ్ మెట్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఆల్రెడీ ఎలిమినేట్ అయిన కంటెస్టంట్స్ ను ఇంట్లోకి పంపించేలా ఓటింగ్ కండక్ట్ చేశారు.
నాని చెప్పిన లెక్కల ప్రకారం దాదాపు 11 కోట్ల పైగ ఈవారం ఓటింగ్స్ జరిగాయట. అందులో టాప్ రేంజ్ లో నూతన్, శ్యామలాకు ఎక్కువ ఓట్లు రావడంతో వారిద్దరిని మళ్లీ బిగ్ బాస్ లోకి వెల్ కం చెప్పారు. అయితే బిగ్ బాస్ చెప్పే వరకు వారు ఇంట్లోకి వెళ్లే అవకాశం లేదట. ఇక అసలు ప్రేక్షకాదరణ పొందని ఈ షోకి 11 కోట్ల ఓట్లు ఎలా వచ్చాయి అన్నది కొంతమంది వాదన. ఏది ఏమైనా తేజూ కూడా మళ్లీ హౌజ్ లోకి వస్తుందని భావించగా కౌశల్ ఆర్మీ నూతన్, శ్యమలాలకు సపోర్ట్ చేశారు. అందుకే వారిద్దరు హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.