భర్తల షాపింగ్ చేయట్లేదు.. పెళ్లి వార్తలపై తమన్న ఫైర్..!

స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించినా కెరియర్ కాస్త అటు ఇటుగా ఉన్నప్పుడు అందరి దృష్టి వారి రిటైర్మెంట్ మీద ఉంటుంది. దానికి పెళ్లి వైపు గాలి మళ్లుతుంది. ఈ క్రమంలో రీసెంట్ గా మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లికి సిద్ధమైందని ఓ వార్త బాగా హల్ చల్ చేసింది. అమెరికాకు చెందిన ఓ డాక్టర్ ను తమన్నా పెళ్లాడేందుకు ఓకే చెప్పిందని వార్తల సారాంశం. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఖండించింది తమన్నా.

ఓ సారి హీరో, మరోసారి క్రికెటర్, ఇప్పుడు డాక్టర్ ఇలా తను పెళ్లిచేసుకోబోయే అతని గురించి మీడియా చేస్తున్న హడావిడికి ఫైర్ అయ్యింది తమన్నా. తానేమి భర్తల షాపింగ్ చేయట్లేదని వివరణ ఇచ్చుకుంది. ఇలాంటి అవాస్తవ వార్తలను ఎందుకు రాస్తున్నారంటూ మండిపడ్డది. తన పెళ్లి విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఒకవేళ అది కన్ఫాం అయితే తానే అభిమానులందరికి వెళ్లడిస్తానని చెప్పుకొచ్చింది మిల్కీ బ్యూటీ. ప్రస్తుతం క్వీన్ రీమేక్ లో నటిస్తున్న తమన్నా, అనీల్ రావిపుడి ఎఫ్-2 సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది.