
బిగ్ బాస్ సెకండ్ సీజన్ బిగ్ బాస్ రూల్స్ అన్నిటిని బ్రేక్ చేస్తుందని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 1 సూపర్ సక్సెస్ అవగా సెకండ్ సీజన్ ఆ అంచనాలను అందుకోలేదు. ముఖ్యంగా హోస్ట్ గా తారక్ అదరగొట్టగా నాని ఎంత ఇంప్రెస్ చేస్తున్నా షో చూడాలన్న ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇక హౌజ్ లో కంటెస్టంట్స్ అయితే ఎపిసోడ్ మొత్తం గొడవ పడటానికే సరిపోతుంది అక్కడ గేం ఆడుతున్నట్టుగా అనిపించడం లేదు.
ఈ క్రమంలో మూడు వారాల నుండి లో టి.ఆర్.పి రేటింగ్ తో ఉన్న బిగ్ బాస్ కు యాంకర్ ప్రదీప్ ఎంట్రీ మంచి ఊపు తెచ్చింది. గెస్ట్ గా వచ్చిన ప్రదీప్ బిగ్ బాస్ హౌజ్ లో గడిపిన రెండు రోజులు బిగ్ బాస్ మీద మళ్లీ ఇంట్రెస్ట్ పెరిగేలా చేసింది. ఇక ఇప్పుడు దాన్ని కొనసాగించేందుకు బిగ్ బాస్ మొదటి సీజన్ విన్నర్ శివ బాలాజి మళ్లీ బిగ్ బాస్ హౌజ్ లోకి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. శివ బాలాజి వచ్చేది గెస్ట్ గానా లేక వైల్డ్ కార్డ్ ఎంట్రీగానా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి బిగ్ బాస్ లో శివ బాలాజి మళ్లీ అలరించనున్నాడని తెలుస్తుంది.