చి.ల.సౌ ట్రైలర్.. మరో పెళ్లిచూపులు అవుతుందా..!

అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన సుశాంత్ హీరోగా సినిమాలైతే చేస్తున్నాడు కాని హీరోగా మాత్రం నిలబడం లేదు. అందుకే ఆటాడుకుందాం రా.. సినిమా తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో చి.ల.సౌ సినిమాతో వస్తున్నాడు సుశాంత్. హీరో రాహుల్ రవింద్రన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ ఇంప్రెస్ చేయగా.. కొద్ది గంటల క్రితం రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. 

సుశాంత్, రుహాని శర్మ జంటగా నటిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తుంది. సినిమా ట్రైలర్ మరో పెళ్లిచూపులు సినిమాగా అనిపిస్తుంది. ఆగష్టు 3న రిలీజ్ అవనున్న ఈ సినిమాపై ట్రైలర్ అంచనాలు పెంచేసింది. సినిమా బజ్ చూస్తుంటే ఈసారి సుశాంత్ కచ్చితంగా హిట్ కొడతాడని అనిపిస్తుంది. సినిమా ప్రమోషన్స్ లో అక్కినేని ఫ్యామిలీ సపోర్ట్ గా నిలుస్తుండగా రిలీజ్ చేస్తున్న కారణంగా నిర్మాతల్లో నాగార్జున పేరు కూడా ఉంచడం విశేషం.