బన్ని.. పూరి.. ఇంట్రెస్టింగ్ న్యూస్..!

నా పేరు సూర్య తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విక్రం కుమార్ తో సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నా.. ఆ సినిమా పట్ల బన్ని అసంతృప్తిగా ఉన్నాడని తెలుస్తుంది. అందుకే ప్రయోగాలు వద్దని విక్రం సినిమా క్యాన్సిల్ చేసుకునే ఆలోచనలో ఉన్నాడట. అయితే ఇంట్రెస్టింగ్ గా బన్ని ఈసారి పూరి డైరక్షన్ లో సినిమా చేయాలని చూస్తున్నాడట. 

వరుస ఫ్లాపుల్లో ఉన్న పూరితో సినిమా అంటే కచ్చితంగా బన్ని రిస్క్ చేస్తున్నట్టే. పూరి సినిమాలు ఫ్లాప్ అవుతున్నా కథల విషయంలో మిస్టేక్స్ తప్ప టేకింగ్ వైజ్ ఆయన పర్ఫెక్ట్. రీసెంట్ గా తనయుడితో తీసిన మెహబూబా సినిమా కూడా పూరి టేకింగ్ పరంగా మార్కులు కొట్టేశాడు. అందుకే ఈసారి బన్ని బయట కథకు పూరి డైరక్షన్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. పూరి అలా చేసిన టెంపర్ సక్సెస్ అయ్యింది. అందుకే పూరికి ఈ సినిమా ప్లస్ అయ్యే అవకాశం ఉంటుందని ఇద్దరు కలిసి సినిమా ప్లాన్ చేస్తున్నారట. మరి బన్ని.. పూరి కలిస్తే ఎలా ఉంటుందో చూడాలి. ఈ కాంబినేషన్ లో దేశముదురు, ఇద్దరమ్మాయిలతో సినిమాలు వచ్చాయి. దేశముదురు సక్సెస్ అవగా.. ఇద్దరమ్మాయిలతో మాత్రం నిరాశపరచింది.