
దర్శకుడిగా తన ప్రతిభ చాటుతూనే నిర్మాతగా తన మార్క్ చూపిస్తున్నాడు మారుతి. అయితే తాను కథ అందించిన సినిమాలో కూడా మారుతి కనిపిస్తాడు. లేటెస్ట్ గా మారుతి రచనలో వస్తున్న సినిమా బ్రాండ్ బాబు. మారుతి బ్రాండ్ కాబట్టి కచ్చితంగా ఫన్ ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పొచ్చు. ప్రభాకర్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో కన్నడ హీరో సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బ లీడ్ రోల్స్ లో నటించారు.
ఈరోజు ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఇంట్లోనే కాదు ఒంటి మీద కూడా తనకు కావాల్సిన బ్రాండ్ ఉండేలా చూసుకునే హీరో ఓ అమ్మాయి ప్రేమలో పడతాడు. అమ్మాయి ప్రేమలో పడిన బ్రాండ్ బాబు పరిస్థితి ఎలా మారింది అన్నది సినిమా కథ. ట్రైలర్ చూస్తే ఇది మారుతి మార్క్ మూవీగా అనిపిస్తుంది. భలే భలే మగాడివోయ్, మహానుభావుడు సినిమాలతో పోలిక ఉన్నట్టు తెలుస్తుంది. ఆగష్టు 3న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ బ్రాండ్ బాబు ఎలా ఉంటాడో చూడాలి.