తేజ్ ఇలా అయితే కష్టమే బాసు..!

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హీరోగా కరుణాకరణ్ డైరక్షన్ లో వచ్చిన సినిమా తేజ్ ఐలవ్యూ. కె.ఎస్ రామారావు నిర్మించిన ఈ సినిమా మెగా మేనళ్లుడి కెరియర్ లో మరో ఫెయిల్యూర్ సినిమాగా మిగిలింది. లవ్ స్టోరీ స్పెషలిస్ట్ అయిన కరుణాకరణ్ మెగా హీరోతో సినిమా అనగానే అంచనాలు ఉన్నాయి కాని వాటిని అందుకోవడంలో విఫలమైంది. ఇక ఈ సినిమా 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా కేవలం 25 శాతం మాత్రమే వసూళ్లను రాబట్టింది.

తేజూ కెరియర్ లోనే తక్కువ బిజినెస్ తో రిలీజ్ అయిన ఈ సినిమా టోటల్ రన్ లో కేవలం 4 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. తిక్క నుండి తేజ్ ఐలవ్యూ వరకు వరుస అపజయాలను ఎదుర్కుంటున్న సాయి ధరం తేజ్ ఇలానే కెరియర్ కొనసాగిస్తే కష్టమే అని చెప్పొచ్చు. ప్రస్తుతం కిశోర్ తిరుమల డైరక్షన్ లో తేజూ సినిమా సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది.