
టాలీవుడ్ లో ప్రస్తుతం సూపర్ ఫాంలో ఉన్న రాశి ఖన్నా ఈ ఇయర్ తొలిప్రేమ హిట్ తో మంచి జోష్ లో ఉంది. ప్రస్తుతం నితిన్ తో శ్రీనివాస కళ్యాణం సినిమాలో నటించింది రాశి ఖన్నా. పెళ్లి ప్రాముఖ్యత తెలిపే ఈ సినిమాలో నటించడం తన అదృష్టంగా భావిస్తుంది రాశి ఖన్నా. ఈ సినిమా కథ విన్న అమ్మడు తన తల్లికి ఈ కథ చెప్పిందట. ఆమె కథ విన్న తర్వాత కన్నీళ్లు పెట్టుకుందట. అంత ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తుంది.
ఇక మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా రాశి ఖన్నా వద్దనుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న తొలిప్రేమలో ఆమె నటన చూసిన తర్వాత ఆమెని ఓకే చేశారట. దిల్ రాజు ఈ సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఈమధ్యనే రిలీజ్ అయిన రాజ్ తరుణ్ లవర్ దిల్ రాజుని నిరాశ పరచగా శ్రీనివాస కళ్యాణం మాత్రం సక్సెస్ కొట్టడం గ్యారెంటీ అంటున్నారు.