తేజూ తమ్ముడు వచ్చేస్తున్నాడు.. మరో మెగా హీరో ఎంట్రీకి రెడీ..!

మెగా ఫ్యామిలీ నుండి వెండితెరకు పరిచయం అవుతున్న హీరోల సంఖ్య పెరుగుతుంది. చిరంజీవి నుండి నిన్న వచ్చిన కళ్యాణ్ దేవ్ వరకు మెగా కాంపౌండ్ నుండి వచ్చిన వారే.. గత మూడు నాలుగేళ్లలో వచ్చిన వరుణ్ తేజ్, సాయి ధరం తేజ్ లు కూడా మెగా అభిమానుల మనసులు గెలిచారు. ఇక విజేతగా వచ్చిన కళ్యాణ్ దేవ్ కూడా ఇంప్రెస్ చేశాడు. త్వరలో మెగా ఫ్యామిలీ నుండి వైష్ణవ్ తేజ్ కూడా తెరంగేట్రం చేసేందుకు రంగం సిద్ధమవుతుందని తెలుస్తుంది.

అసలైతే వైష్ణవ్ తేజ్ ను ఇంట్రడ్యూస్ చేసే బాధ్యతలను కూడా సాయి కొర్రపాటి తీసుకున్నాడట. అయితే కళ్యాణ్ దేవ్ విజేత ఆశించిన విజయం అందుకోలేకపోవడంతో ఇప్పుడు ఆ ఆలోచన నుండి వెనక్కి తగ్గాడట. వైష్ణవ్ తేజ్ ను రామ్ తాళ్లూరి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారట. అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో తన ప్రతిభ చూపిన సాగర్ చంద్ర దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ఉంటుందట. చూస్తుంటే మెగా హీరోలందరు ఓ క్రికెట్ టీం కు సరిపడేలా ఉన్నారు. మరి వీరి హిట్ రేషియో ఎలా ఉంటుందో చూడాలి.