హైదరాబాద్ ఆటోలో కార్తి..!

కోలీవుడ్ స్టార్ హీరోకి హైదరాబాద్ ట్రాఫిక్ చుక్కలు చూపించింది. రీసెంట్ గా చినబాబు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తి ఆ సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొనేందుకు వస్తుండగా మాదాపూర్ దాకా వచ్చాక ట్రాఫిక్ జామ్ అవడంతో అక్కడ నుండి ప్రసాద్ ల్యాబ్స్ కు వచ్చేందుకు కారుతో చేరుకోవడం కష్టమని భావించి ఆటో ఎక్కేశాడు కార్తి. హీరోతో పాటుగా తెలుగులో చినబాబు రిలీజ్ చేసిన రవిందర్ రెడ్డి కూడా ఆ ఆటోలో ఉన్నారు.   

అయితే ట్రాఫిక్ గురించి ఏమాత్రం ప్రస్థావించకుండా సైలెంట్ గా సక్సెస్ మీట్ కు వచ్చి కార్యక్రమం చూసుకుని వెళ్లారు కార్తి. సక్సెస్ మీట్ కు లేటుగా వెళ్లకూడదు అన్న ముఖ్య ఉద్దేశంతోనే ఆటోలో కార్తి ప్రయాణించడం జరిగింది. ఇది చాలదు ఆయన మంచి మనసు గురించి చెప్పడానికి. లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయిన చినబాబు సినిమా యావరేజ్ టాక్ తో రన్ అవుతుంది.