
ఏయన్నార్ స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్ సినిమా పరిశ్రమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చిన్న సినిమా నుండి పెద్ద సినిమా వరకు ప్రొడక్షన్, షూటింగ్, డబ్బింగ్ ఇలా అన్ని విభాగాల్లో వర్క్ జరుగుతుంది. వీటితో పాటుగా అన్నపూర్ణ స్టూడియోస్ నుండి సినిమా నిర్మాణం జరుగుతుంది. ఏయన్నార్ నుండి నాగార్జున ఆ బాధ్యతలను తీసుకున్నాడు.
ప్రొడక్షన్ లో అక్కినేని వెంకట్ కొన్నాళ్లు భాగస్వామ్యం అవగా తర్వాత పూర్తిగా నాగార్జున తన భుజాన వేసుకున్నాడు. నాగార్జున కూడా అన్నపూర్ణ బ్యానర్ కు తగినట్టుగా ఆ స్టాండర్డ్స్ తోనే సినిమాలు నిర్మించారు. ఇక ఇప్పుడు అన్నపూర్ణ బ్యానర్ చైతు, సమంత హ్యాండోవర్ లోకి వచ్చిందని టాక్. స్టూడియో వ్యవహారాలను వెంకట్ కు.. బ్యానర్ నిర్మాణ వ్యవహారాలను పెద్ద కొడుకు చైతు అతని భార్య సమంతలకు అప్పచెప్పాడట నాగార్జున. అందుకే సుశాంత్ చిలసౌ కు చైతు, సమంత ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారు. అంతేకాదు వీరిద్దరి ప్రోత్సావం వల్లే ఆ సినిమాను అన్నపూర్ణ బ్యానర్ లోనే రిలీజ్ చేస్తున్నారట. మొత్తానికి బ్యానర్ వీరి చేతుల్లోకి వచ్చేసినట్టే అని చర్చించుకుంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందన్నది తెలియాల్సి ఉంది.