
విశాల్ హీరోగా లింగు సామి డైరక్షన్ లో వచ్చిన సినిమా పందెం కోడి. విశాల్ ను హీరోగా తెలుగులో నిలబెట్టిన సినిమా అది. అయితే ఆ తర్వాత కోలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ వచ్చిన విశాల్ తన సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తూ వచ్చాడు. లాస్ట్ ఇయర్ డిటెక్టివ్, రీసెంట్ గా వచ్చిన అభిమన్యుడు సినిమాలు తెలుగులో కూడా విశాల్ కు సూపర్ హిట్ అందించాయి.
ప్రస్తుతం పందెం కోడి-2 సెట్స్ మీద ఉంది. లింగు సామి ఈ సీక్వల్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. అక్టోబర్ 18న దసరా కానుకగా ఈ సినిమా రాబోతుంది. తెలుగులో ఈ సినిమాను ఠాగూర్ మధు రిలీజ్ చేస్తున్నారట. తెలుగు రైట్స్ 10 కోట్లకు కొన్నారని తెలుస్తుంది. అయితే శాటిలైట్ రైట్స్ అందులో కలపలేదని తెలుస్తుంది. మొత్తానికి విశాల్ సూపర్ హిట్ మూవీ పందెం కోడి పార్ట్ 2 ఎలా ఉండబోతుందో చూడాలి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.