
రాజమౌళి చేయబోతున్న మెగా నందమూరి మల్టీస్టారర్ సినిమా ఎనౌన్స్ చేసిన టైం నుండి ఆ సినిమాపై రోజులో న్యూస్ సంచలనంగా మారుతుంది. ఇప్పటికే ఈ సినిమా కథ అంటూ ఓ పది రకాల స్టోరీస్ ఫిల్మ్ నగర్ లో చెక్కర్లు కొడుతుండగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్డేట్ అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది. సై నుండి బాహుబలి వరకు రాజమౌళి చేసిన ప్రతి సినిమాకు తన కన్నుగా ఉన్న కెమెరా మన్ సెంథిల్ కుమార్. ఇక తీయబోయే మల్టీస్టారర్ సినిమాకు రాజమౌళి సెంథిల్ ని మార్చి అతని ప్లేస్ లో డాని లోపేజ్ ను తీసుకుంటున్నాడట.
ఇటీవల రిలీజ్ అయిన మహానటి సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన డాని తన కెమెరా పనితనంతో అదరహో అనిపించాడు. మహానటిలో కెమెరా వర్క్ కూడా ముఖ్య పాత్ర వహించింది. ఆ సినిమా చూశాక ఫారిన్ సినిమాటోగ్రాఫర్ తో చేయాలని ఫిక్స్ అయ్యాడట రాజమౌళి. రాజమౌళి సినిమా అంటే ఒకటే టీం రిపీట్ అవుతుంది. అలాంటిది ఈ సినిమాకు కొత్తగా డానికి తన టీం లోకి చేర్చుకుంటున్నాడు ఈ మార్పు యొక్క పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.