సమ్మోహనం సెన్సార్ పూర్తి..!

ఘట్టమనేని ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు స్టార్ ఇమేజ్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ సపోర్ట్ ఉన్నా సరైన సినిమాలు ఎంపిక చేసుకోవడంలో విఫలమవుతున్నాడు సుధీర్ బాబు. ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో సమ్మోహనం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సుధీర్ బాబు. అదితి రావు హైదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు.

ఈ నెల 15న రిలీజ్ అవుతున్న సమ్మోహనం సినిమా ఈరోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ అన్ని సినిమాల్లానే ఈ సమ్మోహనం కూడా యు సర్టిఫికెట్ అందుకుంది. క్లీన్ ఎంటర్టైనర్ గా మోహనకృష్ణ మళ్లీ ఆడియెన్స్ ను అలరించేందుకు వస్తున్నాడని తెలుస్తుంది. సమ్మోహనంలో కూడా ఏమాత్రం తన పరిధి దాటి వెళ్లలేదని తెలుస్తుంది. సినిమా హీరోయిన్, యానిమేటర్ ప్రేమకథతో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇంప్రెస్ చేసింది. మరి ఈ సినిమా అయినా సుధీర్ బాబు కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందేమో చూడాలి.