చెర్రి, తారక్ అమెరికా చెక్కేశారా..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఇద్దరు కలిసి ఒకేసారి ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చారు. ఇద్దరు కలిసి ఒకేచోటికి ప్రయాణం చేస్తున్నారట. అది కూడా సినిమాకు సంబందించని తెలుస్తుంది. రాజమౌళి డైరక్షన్ లో మెగా నందమూరి మల్టీస్టారర్ రాబోతున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా కోసం రాం చరణ్, ఎన్.టి.ఆర్ వర్క్ షాప్ లో పాటిస్పేట్ చేయాల్సి ఉంది. 

ఈ వర్క్ షాప్ మన దగ్గర అనుకున్నారు కాని అది యూఎస్ లో అని తెలుస్తుంది. అందుకే చరణ్, ఎన్.టి.ఆర్ ఇద్దరు కలిసి అమెరికా చెక్కేశారు. ఇద్దరు ఎయిర్ పోర్ట్ లో కనిపించిన ఫోటోనే ఇంత సెన్సేషన్ అయితే ఇక ఇద్దరు కలిసి చేసే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. అక్టోబర్ నుండి మొదలవనున్న ఈ సినిమాకు ముందే రాం చరణ్ బోయపాటి శ్రీను సినిమా.. ఎన్.టి.ఆర్ త్రివిక్రం సినిమా చేయాల్సి ఉంది.