హిమాచల్ ప్రదేశ్ సిఎంగా జై రాం ఠాకూర్

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాం ఠాకూర్ పేరును భాజపా ఖరారు చేసింది. అయన వరుసగా 5సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయన పేరును ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయిన ప్రేమ్ కుమార్ ధుమాల్ ప్రతిపాదించవలసి రావడం విశేషం. హిమాచల్ ప్రదేశ్ రాజపుత్ర వంశానికి చెందిన జై రాం ఠాకూర్ కర్నాటక అల్లుడు కావడం మరో విశేషం. అయన కర్నాటకకు చెందిన డాక్టర్ సాధన అనే అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకొన్నారు. వారికి ఇద్దరు కుమార్తెలున్నారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా జై రాం ఠాకూర్ పేరు ఖరారు అయిపోయింది కనుక త్వరలోనే ఆయన ప్రమాణస్వీకారోత్సవం జరుగుతుంది. ఇక గుజరాత్ లో వరుసగా ఆరోసారి భాజపా అధికారం చేజిక్కించుకోగా, విజయ్ రూపానీ వరుసగా రెండవసారి ముఖ్యమంత్రిగా మంగళవారం బాధ్యతలు చేపట్టారు.