అర్బన్ లీడర్ ఆఫ్ ది ఇయర్: కేటిఆర్

2017 సంవత్సరం ముగింపు కానుక అన్నట్లుగా తెలంగాణా రాష్ట్రానికి మరో రెండు ప్రతిష్టాత్మకమైన అవార్డులు లభించాయి. వాటిలో ఒకటి రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ ‘అర్బన్ లీడర్ ఆఫ్ ది ఇయర్’ అందుకోగా, పట్టణాలలో మంచి మౌలికవసతులను కల్పిస్తున్న రాష్ట్రంగా తెలంగాణాకు దక్కిన మరో అవార్డును రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టణాభివృద్ధిశాఖ ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ అందుకొన్నారు. బిజినెస్ వరల్డ్ సంస్థ ప్రకటించిన ఈ రెండు అవార్డులను బుధవారం డిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రి హర్దీప్ సింగ్ చేతుల మీదుగా కేటిఆర్, నవీన్ మిట్టల్ అందుకొన్నారు.