ఇక వరంగల్ అంతా ఆమ్రపాలిదే

వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ గా చేస్తున్న ప్రశాంత్ జీవన్ ను కుమ్రుం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు బదిలీ చేసినందున వరంగల్ అర్బన్ జిల్లాకు కలెక్టర్ గా వ్యవహరిస్తున్న ఆమ్రపాలి కాటాకు వరంగల్ రూరల్ జిల్లా భాద్యతలను కూడా అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కనుక ఇప్పుడు వరంగల్ రూరల్, అర్బన్ రెంటినీ ఆమె చూసుకోవలసి ఉంటుంది. అయితే ఆమె గురువారం వరకు శలవులో ఉన్నందున ఆమె వచ్చే వరకు మహబూబ్ నగర్ కలెక్టర్ ప్రీతీ మీనాకు వరంగల్ రూరల్, అర్బన్ జిల్లాల బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.