జైలు నుంచి న్యాయమూర్తి విడుదల

సాధారణంగా కోర్టు ధిక్కారం కేసులలో దోషులకు న్యాయమూర్తులు జైలు శిక్షలు విధిస్తుంటారు. కానీ కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు కోల్ కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సిఎస్.కర్ణన్ కు సుప్రీం కోర్టు ఆరు నెలల జైలుశిక్ష విధించిన సంగతి బహుశః అందరికీ గుర్తుండే ఉంటుంది. కోల్ కతా లోని ప్రెసిడెన్సీ జైలులో 6 నెలల జైలుశిక్ష అనుభవించిన తరువాత అయన బుధవారం విడుదలయ్యారు. అంత ఉన్నత పదవిలో ఉండి కూడా నోటి దురుసుతనం వలన జైలు పాలయ్యారు. కనుక ఇకనైనా ఆయన నోరును అదుపులో పెట్టుకొంటారో లేదో చూడాలి. 

అయనకు సుప్రీం కోర్టు బెయిల్ నిరాకరించడంతో కొంతకాలం పాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. చివరికి ఈ ఏడాది జూన్ 20వ తేదీన ఆయనను కోయంబత్తూర్ లో  పశ్చిమబెంగాల్ పోలీసులు అరెస్ట్ చేసి జైల్లోకి పంపారు. శిక్ష పూర్తి చేసుకొని నిన్న బయటకు వచ్చారు.