గుజరాత్ అసెంబ్లీ సీట్లపై 28శాతం జి.ఎస్.టి?

పప్పులు, ఉప్పులు, సబ్బులు, టీవీలు, కార్లు, సేవలపై 0-28 శాతం వరకు జి.ఎస్.టి.బాదుడు గురించి ప్రజలకు తెలుసు కానీ ఓట్లు, సీట్లపై జి.ఎస్.టి. విధించడం ఎవరూ విని ఉండరు. ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లు, సీట్లపై జి.ఎస్.టి. విధించబడిందిట! అయితే ఈసారి ప్రజలే భాజపాకు 28 శాతం జి.ఎస్.టి.కోత విధించారుట! ఎలాగంటారా...సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ జోక్ చూసి మీరు ఆనందించండి.

గుజరాత్ ఎన్నికల ప్రచారం సందర్భంగా మోడీ, అమిత్ షాలు ఇద్దరూ తమ పార్టీకి కనీసం 150 సీట్లు ఇచ్చి బారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రజలను కోరారు. ప్రజలు కూడా అందుకు అంగీకరించి మొత్తం 182 సీట్లపై 28 శాతం జి.ఎస్.టి. కోత విధించగా అది 51 సీట్లుగా లెక్క తేలింది. మోడీ, అమిత్ షాలు కోరిన 150 సీట్లలో నుంచి వాటిని తీసివేయగా మిగిలిన 99 సీట్లు భాజపాకు ఇచ్చారుట! బాగుంది కదా జి.ఎస్.టి. లెక్క!