ఐటి మంత్రిగారే కన్ఫ్యూజ్ అయితే ఎలా?

ప్రస్తుతం దేశంలో అన్ని న్యూస్ ఛానల్స్ కూడా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను తాజా ఫలితాలను తెలియజేస్తున్నాయి. అయితే ఎప్పటిలాగే ఒక్కో న్యూస్ ఛానల్ ఒక్కో సంఖ్య ప్రకటిస్తూ జనాలను గందరగోళానికి గురించి చేస్తున్నాయి. పైగా గుజరాత్ లో భాజపా, కాంగ్రెస్ ల మద్య నువ్వా నేనా? అన్నట్లు ఎన్నికల ఫలితాలు వెలువడుతుండటంతో, కాంగ్రెస్ అనుకూల, భాజపా అనుకూల టీవీ ఛానల్స్ ప్రకటిస్తున్న రకరకాల సంఖ్యలతో ఆ రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచి అధికారంలోకి రాబోతోందనే అయోమయం ఏర్పడుతోంది. రాష్ట్ర ఐటి మంత్రి కేటిఆర్ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఈ ఎన్నికల ఫలితాలు, వాటిపై విశ్లేషకుల అభిప్రాయలు వగైరా విషయాలను అర్ధం చేసుకోగలను. కానీ ఒక్కో ఛానల్ ఒక్కో సంఖ్య ప్రకటిస్తూ గందరగోళం సృష్టిస్తున్నాయి. అయితే నిజాలు, సంఖ్యలు ఎలా మారుతాయి?” అని ట్వీట్ చేశారు. నిజమే కదా! 

 తాజా సమాచారం ప్రకారం గుజరాత్ లో (192 స్థానాలు) భాజపా 91 స్థానాలలో గెలుపొంది, మరో 8 స్థానాలలో ఆధిక్యతలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 73 స్థానాలలో విజయం సాధించి, మరో 6 స్థానాలలో ఆధిక్యతలో ఉంది. ఇతరులు రెండు స్థానాలలో విజయం సాధించి ఒక స్థానంలో ఆధిక్యతలో ఉన్నారు.  

ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 92 స్థానాలు భాజపా సాధించినట్లే కనుక గుజరాత్ లో వరుసగా మళ్ళీ 6వ సారి భాజపా ప్రభుత్వం ఏర్పడబోతోంది. 

ఇక హిమాచల్ ప్రదేశ్ లో  (68 స్థానాలు) భాజపా 20 స్థానాలలో గెలుపొంది, మరో 25 స్థానాలలో ఆధిక్యతలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 9 స్థానాలలో విజయం సాధించి, 10 స్థానాలలో ఆధిక్యతలో ఉంది. మరో మూడు 3 స్థానాలలో ఇతరులు విజయం సాధించారు. ఒక్క స్థానంలో ఆధిక్యతలో ఉన్నారు.