ఎన్నికల ఫలితాలు లేటెస్ట్ అప్-డేట్

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో భాజపా గెలుపు ఖాయం అయిపోయింది. గుజరాత్ లో మొత్తం 182 స్థానాలలో 157 స్థానాలకు ఫలితాలు వెలువడ్డాయి. వాటిలో భాజపా 89, కాంగ్రెస్ పార్టీ 66, ఇతరులు 02 స్థానాలలో గెలుపొందారు. ఇంకా భాజపా మరో 9 స్థానాలలో, కాంగ్రెస్ 12, ఇతరులు 1 స్థానంలోను ఆధిక్యతలో ఉన్నారు.   

ఇక హిమాచల్ ప్రదేశ్ లో మొత్తం 68 స్థానాలుండగా ఇంతవరకు వాటిలో 31స్థానాలకు ఫలితాలు వెలువడ్డాయి. వాటిలో భాజపా 19, కాంగ్రెస్  8, 3 ఇతరులు 3 స్థానాలలో విజయం సాధించారు. మరో 25 స్థానాలలో భాజపా, 121 స్థానాలలో కాంగ్రెస్, 3 స్థానాలలో ఇతరులు ఆధిక్యతలో ఉన్నారు.