త్వరలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశం?

తెలంగాణా ఏర్పడినప్పుడు ఉండే పది జిల్లాలను పునర్వ్యవస్థీకరించి 31 జిల్లాలుగా మార్చిన తరువాత, ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పుడు పంచాయితీ వ్యవస్థపై దృష్టి సారించారు. పంచాయితీ రాజ్ చట్టంలో అవసరమైన మార్పులు చేర్పులు చేసి దానిని మరింత పటిష్టంగా, సమర్ధంగా పనిచేసేవిధంగా మలిచే ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం డిసెంబర్ మొదటివారంలో శాసనసభ, మండలిని ప్రత్యేకంగా సమావేశపరిచి, కొత్త పంచాయితీ రాజ్ బిల్లును ఆమోదింపజేయాలని భావిస్తున్నారు. పంచాయితీ రాజ్ శాఖ అధికారులు అందుకోసం ముసాయిదా బిల్లును రూపొందిస్తున్నారు. అది సిద్దం కాగానే మంత్రివర్గ సమావేశం నిర్వహించి, దానిని ఆమోదించి, అసెంబ్లీ సమావేశాల తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది. బహుశః రెండు మూడు రోజులపాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది.