సదస్సుకు బాబును ఎందుకు ఆహ్వానించలేదు?

హైదరాబాద్ లో జరుగుతున్న అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సుకు ఏపి సిఎం చంద్రబాబు నాయుడును ఆహ్వానించకుండా తెరాస సర్కార్ అవమానించిందని హైదరాబాద్ నగర టిటిడిపి అధ్యక్షుడు ఎం.ఎన్.శ్రీనివాసరావు అన్నారు. హైదరాబాద్ నగరానికి ఐటి రంగంలో అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చిన చంద్రబాబు నాయుడును ఈ సదస్సుకు ఆహ్వానించకపోవడం చాలా దారుణమని అన్నారు. తెదేపాకు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు సమానమని, రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీపడాలని కొరుకొంటోందని, కానీ తెరాస సర్కార్ మాత్రం చంద్రబాబు నాయుడును ఈ సదస్సుకు ఆహ్వానించకుండా ఆయన పట్ల అకారణ విద్వేషం ప్రదర్శించిందని అన్నారు.