హైదరాబాద్ అందాలు చూడాల్సిందే...

ఈ నెల 28 నుంచి 30 వరకు జరుగబోయే అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు కోసం హైదరాబాద్ అందంగా ముస్తాబయింది. వర్షాలు పడినప్పుడు నరకాన్ని తలపించిన హైదరాబాద్ నగరాన్ని ఇప్పుడు చూడటానికి రెండు కళ్ళూ సరిపోవడం లేదు. రోడ్ల పక్కన పూలమొక్కలు, గోడలపై రంగురంగుల అందమైన చిత్రాలు, రంగురంగులతో ధగధగా మెరిసిపోతున్న ఫ్లైఓవర్లు చూడాల్సిందే తప్ప వర్ణించడం సాధ్యం కాదు. అయితే ఎవరో ముక్కు మొహం తెలియని విదేశీయులు మూడు రోజుల కోసం హైదరాబాద్ నగరానికి వస్తున్నప్పుడు నగరాన్ని ఇంత అందంగా ముస్తాబు చేయగలిగినప్పుడు, హైదరాబాద్ లోనే నివసించే ప్రజల కోసం ఈవిధంగా చేయలేరా? అనే సందేహం కలుగుతుంది. ఈ రంగురంగుల అందమైన హైదరాబాద్ రోడ్లు ఎప్పటికీ ఇలాగే ఉంటే బాగుండుననిపిస్తుంది. వాటిని చూసి మీరు ఆనందించండి..