సంబంధిత వార్తలు
ఈనెల 28-30 తేదీలలో హైదరాబాద్ లో జరుగబోయే అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొనేందుకు వస్తున్న దేశవిదేశీ అతిధులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 29న గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి కెసిఆర్ విందు ఇవ్వబోతున్నారు. దానికి ముఖ్య అతిధిగా ఇవంకా ట్రంప్ హాజరవుతారని అనుకొన్నప్పటికీ, భద్రతా కారణాల రీత్యా ఆమె దానికి హాజరు కావడంలేదని తాజా సమాచారం. అవె కారణాల చేత ఆమె చార్మినార్ తదితర ప్రాంతాలలో పర్యటించడం కూడా అనుమానమేనని తెలుస్తోంది. ఆమె 29 రాత్రి సదస్సు నుంచి రోడ్డు మార్గం ద్వారా నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొని, ప్రత్యేక విమానంలో అమెరికా తిరిగి వెళ్ళిపోతారని తెలుస్తోంది.