2018లో శలవు దినాలివే

2018 సంవత్సరంలో శలవు దినాల జాబితాను తెలంగాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పి సింగ్ శుక్రవారం విడుదల చేశారు. వాటిలో మొత్తం 28 సాధారణ శలవు దినాలు, 22 ఐచ్చిక (ఆప్షనల్ హాలీడేస్) శలవు దినాలు ఉన్నాయి. సాధారణ శలవు దినాలలో మూడు ఆదివారాలు, ఒకటి రెండో శనివారం నాడు పడ్డాయి. ఐచ్చిక శలవు దినాలలో నాలుగు ఆదివారాలు, ఒకటి రెండో శనివారంనాడు వచ్చాయి. కొత్త సంవత్సరంలో జనవరి 1వ తేదీని ప్రభుత్వం శలవు దినంగా ప్రకటించింది. 

సాధారణ శలవుల జాబితా: 

జనవరి నెలలో శలవులు: నూతన సంవత్సరం:1, సంక్రాంతి: 15, గణతంత్ర దినోత్సవం: 26వ తేదీలు 

ఫిబ్రవరి: మహా శివరాత్రి: 13 తేదీ

మార్చి :  హోలీ: 1, ఉగాది: 18 (ఆదివారం), శ్రీరామ నవమి: 26, గుడ్ ఫ్రైడే: 30 వ తేదీలు

ఏప్రిల్: వార్షిక ఖాతాల ముగింపు దినం: 1 (ఆదివారం), బాబు జగజీవన్ రాం జయంతి: 5, డాక్టర్ అంబేద్కర్ జయంతి: 14 (రెండో శనివారం)

మే: మేడే: 1వ తేదీ.

జూన్: రంజాన్: 16వ తేదీ.

ఆగస్ట్: స్వాతంత్ర్య దినోత్సవం: 15, బక్రీద్: 22వ తేదీలు.

సెప్టెంబర్: శ్రీకృష్ణాష్టమి: 3, వినాయక చవితి : 13, మొహర్రం: 21వ తేదీలు

అక్టోబర్: గాంధీ జయంతి: 2, దుర్గాష్టమి : 17, విజయదశమి: 18వ తేదీలు

నవంబర్: దీపావళి: 7, ఈద్ మిలాదున్ నబీ: 21, కార్తిక పౌర్ణమి మరియు గురునానక్ జయంతి: 23వ తేదీలు.

డిసెంబర్ నెలలో శలవు: క్రిస్మస్: 25వ తేదీ.        

ఐచ్చిక శలవులు: భోగి: జనవరి 14 (ఆదివారం), కనుమ: జనవరి 16, శ్రీ పంచమి: జనవరి 22, హజ్రత్ అలీ జన్మదినం: ఫిబ్రవరి 1, మహావీర్ జయంతి: మార్చి 29, బిఆర్ అంబేద్కర్ జయంతి: ఏప్రిల్ 14( రెండో శనివారం), బసవ జయంతి: ఏప్రిల్ 18, షబ్-ఈ-బరాత్: మే 2, షహదత్  హజ్రత్ అలీ: జూన్ 5, జుమాతుల్ వాదా: జూన్ 15, రంజాన్ మరుసటి రోజు: జూన్ 17 (ఆదివారం), పార్సీ నూతన సంవత్సరం: ఆగస్ట్ 17, వరలక్ష్మీ వ్రతం: ఆగస్ట్ 24, ఈద్-ఈ-గదీర్: ఆగస్ట్ 30, తొమ్మిదో మొహర్రం: సెప్టెంబర్ 20, ఆర్బెయిన్: అక్టోబర్ 10, నరక చతుర్దశి: నవంబర్: 6, యాజ్ దహూం షరీఫ్: డిసెంబర్: 19, క్రిస్మస్ ఈవ్: డిసెంబర్:24వ తేదీలు.