సిబిఐ ఆఫీసర్ ఇంట్లో దొంగలు పడ్డారు

జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులను దర్యాప్తు చేసి అతనిని జైలుకు పంపించిన సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ ఇంట్లో నిన్న రాత్రి దొంగలు పడ్డారు. హైదరాబాద్ బంజారాహిల్స్ ప్రాంతంలో ఉన్న అయన ఇంట్లో నిన్న రాత్రి దొంగలు పడి సుమారు 20 తులాల బంగారం దోచుకుపోయారు. ఆయన అర్ధాంగి ఈరోజు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.