త్వరలో సింగరేణిలో 12 కొత్త గనులు ప్రారంభం

సింగరేణిలో త్వరలోనే 12 కొత్త గనులను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ఈరోజు శాసనసభలో ప్రకటించారు. వాటిలో ఆరు ఓపెన్ కాస్ట్ గనులు కాగా, ఆరు భూగర్భగనులు ఉంటాయని తెలిపారు. సింగరేణి ఉద్యోగాల కోసం స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. సింగరేణి బొగ్గు గనులు విస్తరించి ఉన్న మూడు జిల్లాలలో ఒక్కొక్కటి చొప్పున మూడు సెంటర్లను ఏర్పాటు చేయాలనుకొంటున్నట్లు చెప్పారు. ఇప్పటికే సింగరేణిలో 12,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని, కొత్తగా ఏర్పాటు కాబోతున్న ఈ ఆరు గనులు కూడా ప్రారం అయితే, వాటిలో ఇంకా అనేక వేల ఉద్యోగాలు ఏర్పడతాయని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. త్వరలోనే తాను సింగరేణిలో పర్యటించి, వీలైతే కొత్త బొగ్గు గనులు, స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లను ప్రారంభించాలనుకొంటున్నానని తెలిపారు. సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల సందర్భంగా తాము కార్మికులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ కెసిఆర్ హామీ ఇచ్చారు.