తాజా సమాచారం ప్రకారం బుధవారం రాత్రి హైదరాబాద్ సనత్ నగర్ బస్టాండ్ వద్ద వల్లభనేని శ్రీనివాసరావు అనే తెరాస కార్యకర్తను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో తలపై మోది అతికిరాతకంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. విశేషమేమిటంటే, అతను పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లుకు చెందినవారు. కొన్నేళ్ళ క్రితం హైదరాబాద్ తరలివచ్చి నగరంలోనే స్థిరపడ్డారు. గ్రేటర్ ఎన్నికలకు ముందు నగరంలో అనేకమంది ఆంధ్రాకు చెందినవారు తెరాసలో చేరినప్పుడు శ్రీన్విఅస రావు కూడా చేరారు. అప్పటికే తెరాసలో ఉన్నవారికీ, శ్రీనివాసరావు వంటి పొరుగు రాష్ట్ర కార్యకర్తలకు మద్య భేదాభిప్రాయాలు. తత్ఫలితంగా వారిమధ్య ఘర్షణ ఏర్పడటం సహజమే. శ్రీనివాస్ హత్యకు కూడా అదే కారణం అయ్యుండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సనత్ నగర్ బస్టాండ్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. అటువంటి ప్రాంతంలో ఇంత దారుణమైన హత్య జరిగిందంటే నమ్మశక్యంగా లేదు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.