ప్రొఫెసర్ కంచ ఐలయ్య హైకోర్టును ఆశ్రయించారు. ఆయన ప్రచురించిన ‘సామాజిక స్మగ్లర్లు:కోమటోళ్ళు’ అనే పుస్తకం తమ మనోభావాలను గాయపరిచిందంటూ రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక మంది వివిద న్యాయస్థానాలలో పిటిషన్లు వేశారు. వాటన్నిటినీ కొట్టివేయాలని తన పిటిషన్ లో కోరారు. ఆయన తరపున హైకోర్టులో వాదించిన న్యాయవాది ఏ సత్యప్రసాద్, ఆ పుస్తకం ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యంతో ఐలయ్య వ్రాయలేదని, కేవలం సమాజంలో వాస్తవ పరిస్థితులను తెలియజేస్తూ వ్రాసారని తెలిపారు. కనుక ఐలయ్యపై వివిద కోర్టులలో వేసిన కేసులు కొట్టివేయాలని హైకోర్టును అభ్యర్ధించారు. అయన పిటిషన్ పై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు ఈ కేసులో ప్రతివాదుల వాదనలు కూడా వినాల్సిన అవసరం ఉంది కనుక సోమవారానికి వాయిదా వేసింది.