సంబంధిత వార్తలు
వరంగల్ అర్బన్ జిల్లా ఎనుమాముల మండలం కొత్తపేటలో నలుగురు బాలురు సరదాగా ఈతకని నీటి కుంటలో దిగి నీట మునిగి చనిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన నదీమ్(16), రంజాన్ (16), మొహీన్ (14), రసూల్ (15) నలుగురు కలిసి ఈత రాకపోయినా నీటి గుంటలో దిగారు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఇతరులు ఎవరూ అటుగా రాకపోవడంతో వారిని ఎవరూ కాపాడే అవకాశం లేకపోయింది. నలుగురూ ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో వారి తల్లితండ్రులు, బందుమిత్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకొని పోలీసులు అక్కడకు చేరుకొని కేసు నమోదు చేసుకొని వారి శవాలను పోస్ట్ మార్టం కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.