దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచింది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడి మూడున్నరేళ్ళు పూర్తయింది అయినా ఇంకా దళితుల పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదని ఈ సంఘటన చూస్తే అర్ధం అవుతుంది. సుమారు నెలరోజుల క్రితం దసరా పండుగ సమయంలో జరిగిన ఈ ఘటనకు సంబందించి వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలోకి రావడంతో వెలుగులోకి వచ్చింది.
ఈ దారుణమైన సంఘటన నిజామాబాద్ జిల్లా నబీపేట మండలం అంబకపట్నం గ్రామంలో లో జరిగింది. భాజపా నేతగా చెప్పుకోబడుతున్న భరత్ రెడ్డి అనే వ్యక్తి ఇద్దరు దళితులను నోటికి వచ్చినట్లు బూతులు తిడుతూ, వారిని కర్ర తీసుకొని బెదిరిస్తూ, చేసిన తప్పుకు శిక్షగా రోడ్డు పక్కనే ఉన్న ఒక బురద గుంటలో మునగమని అరుస్తూ కనబడుతున్నాడు. వారు ఏదో చెప్పబోతుంటే వారిని 'మునుగుతారా లేదా..?' అంటూ కర్ర చూపుతూ బూతులు తిడుతూ, వారిరువురి ఫోటోలను తన సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. అతను చేస్తున్న దానిని వెనుక నుంచి మరెవరో చిత్రీకరించారు. ఆ వీడియో సోషల్ మీడియాలోకి అప్-లోడ్ చేయడంతో సంచలనం సృష్టిస్తోంది.
అయితే రాష్ట్ర భాజపా అతను తమ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదని స్పష్టం చేసింది. తమ పార్టీ దళితుల హక్కులను కాపాడటానికి పోరాడుతుంది తప్ప వారిపై ఈవిధంగా దాడులు చేయడాన్ని ప్రోత్సహించదని ఆ పార్టీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు తెలిపారు.
భరత్ రెడ్డి అనే ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవలసిందిగా మజ్లీస్ పార్టీతో సహా ప్రతిపక్షాలు గట్టిగా ఒత్తిడి తెచ్చినప్పటికీ, బాధితుల నుంచి పిర్యాదు అందకపోవడం వలన ఎటువంటి చర్యలు తీసుకోలేదని సమాచారం.
వీడియో ఆంధ్రజ్యోతి సౌజన్యంతో :