సంబంధిత వార్తలు
తెలంగాణా సాధన కోసం 60 ఏళ్ళ క్రితమే పోరాటాలు చేసిన దేశినేని చిన్న మల్లయ్య శుక్రవారం రాత్రి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. అయన తెలంగాణా తొలినాటి ఉద్యమాల నుంచి చివరిదశ పోరాటాల వరకు ప్రతీ స్థాయిలో పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో ఇందుర్తి నియోజకవర్గం సిపిఐ తరపున నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సుదీర్ఘకాలంపాటు తెలంగాణా రాష్ట్ర సాధన కోసం పోరాడిన వారిలో ఒకరైన దేశినేని చిన్న మల్లయ్య మృతికి ముఖ్యమంత్రి కెసిఆర్ కెసిఆర్ సంతాపం తెలిపారు. తెలంగాణా పట్ల అంతటి నిబద్దత గల మహనీయుడిని కోల్పోవడం చాలా బాధాకరమని అన్నారు. అయన కుటుంబ సభ్యులకు కెసిఆర్ ప్రగాడ సానుభూతి తెలిపారు.