బస్సు ప్రయాణీకులకు మంచి సేవలు అందిస్తున్న రెడ్-బస్ సంస్థ గురించి అందరికీ తెలిసిందే. నిజామాబాద్ జిల్లాకు చెందిన దాని సహ వ్యవస్థాపకుడు ఫణీంద్రకు రాష్ట్ర ప్రభుత్వం అరుదైన బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రంలో ఐటి రంగాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నాలలో భాగంగా ప్రభుత్వం స్టార్ట్-అప్ సంస్థలు ఏర్పాటు చేస్తోంది. ఆ వ్యవస్థను మరింత పటిష్టపరిచి రాష్ట్రంలో అన్ని జిల్లాలకు విస్తరించే బాధ్యతను ఫణీంద్రకు అప్పగించింది. అందుకోసం అయనను తెలంగాణా చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ గా నియమిస్తూ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటిఆర్ శుక్రవారం ఆయనకు అపాయింట్ మెంట్ లెటర్ కూడా ఇచ్చారు. వివిధ విద్యాసంస్థలతో అనుసంధానం చేయబడిన ఈ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తయారుచేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. తన విన్నూత్నమైన ఆలోచనలు, ఆవిష్కరణలతో రెడ్-బస్ ప్రాజెక్టును విజయవంతంగా నడిపిస్తున్న ఫణీంద్ర ప్రతిభ గురించి తెలుసుకొన్న కేటిఆర్ ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.