అమీర్ పేటకు మెట్రో రైల్ వచ్చేసిందోచ్

హైదరాబాద్ వాసులు ఎన్నాళ్ళగానో ఎదురుచూస్తున్న రోజు దగ్గరపడుతోంది. ఈనెల 28న ప్రధాని నరేంద్ర మోడీ మియాపూర్-అమీర్ పేట్-నాగోల్ మెట్రో రైల్ సర్వీసులను ప్రారంభోత్సవం చేయనున్నందున, దానికోసం ఇప్పటి నుంచే శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు మెట్రో రైల్ అధికారులు.

ఈ రైల్వే లైన్ లో ప్రధానమైన అమీర్ పేట్ ఇంటర్ చేంజ్ స్టేషన్ మెట్రో రైల్వే స్టేషన్ కు మంగళవారం రాత్రి మెట్రో రైల్ చేరుకొంది. అది చూసి ప్రజలు చాలా సంతోషించారు. ట్రయల్ రన్స్ లో భాగంగా నాగోల్ డిపో నుంచి అమీర్ పేట్ చేరుకొన్న మెట్రో రైల్ మళ్ళీ వెంటనే డిపోకు తిరిగి వెళ్లిపోయింది. మెట్టుగూడ నుంచి బేగంపేట వరకు ట్రయల్ రన్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. ఈనెల 20 వరకు అమీర్ పేట్ వరకు ట్రయల్ రన్స్ నిర్వహించి, కమిషనర్‌ ఆఫ్ మెట్రో రైలు సేఫ్టీ (సి.ఎం.ర్.ఫ్) అనుమతి తీసుకొన్న తరువాత, ఈనెల 28 నుంచి ఈ రూట్లో మెట్రో సర్వీస్ ప్రారంభించడానికి హైదరాబాద్ మెట్రో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ మార్గంలో మియాపూర్ నుంచి అమీర్ పేట్ సమీపంలో గల ఎస్.ఆర్.నగర్ వరకు ట్రయల్ రన్స్ నిర్వహించి, మెట్రో సర్వీసు ప్రారంభించడానికి అనుమతి లభించింది. మియాపూర్ నుంచి నాగోల్ వరకు మద్యలో నగరంలోని అన్ని ముఖ్యప్రాంతాలను టచ్ చేస్తూ ఈ మెట్రో రైల్ సాగుతుంది కనుక ఈ మెట్రో సర్వీస్ అందుబాటులోకి వస్తే ప్రజల ట్రాఫిక్ కష్టాలు తప్పుతాయి.

మెట్రో రైల్ రూట్ మ్యాప్ ఈవిధంగా ఉంటుంది: