ఏపిలో ప్రధాన ప్రతిపక్షపార్టీ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి నేటి నుంచి ఏకధాటిగా 6 నెలలు ఏపి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో ‘ప్రజా సంకల్పయాత్ర’ పేరిట పాదయాత్రకు బయలుదేరారు. ఇడుపులపాయలో తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధివద్ద కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్ధనలు చేసిన తరువాత అయన తన పాదయాత్ర ప్రారంభించారు. రోజుకు కనీసం 10 కిమీ చొప్పున రాష్ట్రంలోని అన్ని జిల్లాల గుండా మొత్తం 3,000 కిమీ పాదయాత్ర చేయబోతున్నారు. మార్గంలో ప్రతీరోజు ప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తుంటారు. కొన్నిచోట్ల బహిరంగ సభలు నిర్వహిస్తారు. మొదటిరోజైన సోమవారంనాడు కడపజిల్లాలో వేంపల్లి వరకు పాదయాత్ర చేసి రాత్రికి అక్కడే బసచేస్తారు.
అక్రమాస్తుల కేసులలో ప్రతీ శుక్రవారం హైదరాబాద్ సిబిఐ కోర్టులో జరిగే విచారణకు తప్పనిసరిగా హాజరుకావాలని న్యాయస్థానం తేల్చిచెప్పినందున, అందుకు తగ్గట్లుగా జగన్మోహన్ రెడ్డి ఏర్పాట్లు చేసుకొన్నారు.