తిరుమల శ్రీవారిని దర్శించుకొన్న జగన్

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి శనివారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. ఆయన ఈనెల 6వ తేదీ నుంచి 6 నెలలపాటు ‘ప్రజా సంకల్పయాత్ర’ పేరుతో ఏపిలో పాదయాత్ర చేయనున్నారు. అది విజయవంతం కావాలని కోరుకొంటూ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకొన్నారు. ఆయనతో పాటు వైకాపా ఎంపిలు విజయసాయి రెడ్డి, వర ప్రసాద్‌, మిథున్ రెడ్డి, వైకాపా ఎమ్మెల్యేలు రోజా, పెద్దిరెడ్డి, చెవిరెడ్డి, స్థానిక వైకాపా నేతలు శ్రీవారిని దర్శించుకొన్నారు.