అక్రమ గనుల త్రవ్వకాలలో నిందితుడుగా ఉన్న గాలి జనార్ధన్ రెడ్డికి ఈరోజు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అయన తన కుమార్తె వివాహపు మొదటి సంవత్సర వార్షికోత్సవంలో పాల్గొనేందుకు ఈ నెల 5వ తేదీ నుంచి 20 వరకు లండన్ వెళ్ళివచ్చేందుకు అనుమతించవలసిందిగా కోరుతూ వేసిన పిటిషన్ను హైకోర్టు ఈరోజు తిరస్కరించింది. ఈ కేసులో అయన ఈవంకతో లండన్ వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారని, ఒకసారి అయన లండన్ వెళ్ళిపోతే ఇక విజయ్ మాల్యాలాగ ఎన్నటికీ తిరిగిరారని, అదే జరిగితే ఆయనపై ఉన్న కేసులు స్తంభించిపోతాయని, కనుక ఆయనను విదేశాలు వెళ్ళడానికి అనుమతించరాదన్న సిబిఐ న్యాయవాది వాదనలతో ఏకీభవించిన హైకోర్టు గాలి పిటిషన్ను తిరస్కరించింది.