మాదకద్రవ్యాల కేసులో త్వరలో ఛార్జ్ షీట్స్?

సుమారు నాలుగు నెలల క్రితం తెలుగు సినీ పరిశ్రమలో 15 మంది ప్రముఖులకు మాదకద్రవ్యాల కేసులో విచారణ జరిగినప్పుడు అది ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ కేసులపై దర్యాప్తు పూర్తిచేసి డిశంబర్ లోగా ఛార్జ్-షీట్లు దాఖలు చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ డైరక్టర్ అకున్ సబర్వాల్ అప్పుడే చెప్పారు. ఈ కేసులకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక ఎక్సైజ్ అధికారుల చేతికి అందడంతో త్వరలోనే నిందితులపై ఛార్జ్-షీట్లు దాఖలు చేయడానికి సిద్దం అవుతున్నట్లు సమాచారం. అయితే సరైన సాక్ష్యాధారాలు లేనందున విచారణకు హాజరైనవారిలో కొంతమందిపై మాత్రమే ఛార్జ్-షీట్స్ దాఖలు చేయబోతున్నట్లు సమాచారం.