రేవంత్ రెడ్డి అంటే వర్మకు అంత ప్రేమ దేనికో?

కడవంత గుమ్మడి కాయ అయినా చిన్న కత్తిపీటకు లోకువే అన్నట్లు ఎవరు ఏ రంగంలో ఎంత పెద్దవారైనా  రామ్ గోపాల్ వర్మకు లోకువే. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి అంటే రామ్ గోపాల్ వర్మకు ఎందుకో ప్రేమ కారిపోతున్నాడు. రేవంత్ రెడ్డిని మొన్న కాంగ్రెస్ పార్టీలో బాహుబలితో పోల్చిన రామ్ గోపాల్ వర్మ ఈరోజు ఖైదీ నెంబర్: 150లో చిరంజీవితో పోల్చుతూ రేవంత్ రెడ్డి ఫోటోలను మార్ఫింగ్ చేసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. దాని కోసం ఖైదీ నెంబర్: 150లో చిరంజీవి విలన్ గ్యాంగ్ అందరినీ చితగ్గొటేసిన రెండు ఫోటోలను వాడుకొన్నాడు. మళ్ళీ దానిpai రియల్ మెగాస్టార్ ఇన్ కాంగ్రెస్ అని మరిచిపోకుండా తన అభిప్రాయం కూడా చెప్పాడు. బహుశః ఆయన ఉద్దేశ్యంలో ఈ కాంగ్రెస్ మెగాస్టార్ రేవంత్ రెడ్డి తన ప్రత్యర్ధులైన తెరాస నేతలందరినీ చితగ్గొటేస్తాడని కావచ్చు. దీనిపై చిరంజీవి అభిమానులు, తెరాస శ్రేణులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.