టిడిపికి గుడ్ బై చెప్పిన రేవంత్ రెడ్డి మంగళవారం డిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో బాటు మరో 18 మంది నేతలు కూడా కాంగ్రెస్ లో చేరారు. ఈ కార్యక్రమానికి పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి, తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-ఛార్జ్ రామచంద్ర కుంతియా, సీనియర్ కాంగ్రెస్ నేతలు మధుయాష్కీ గౌడ్, చిన్నారెడ్డి, గీతారెడ్డి, అనిల్ యాదవ్, మల్లు రవి, గండ్ర వెంకట రమణ, కుసుమ కుమార్ తదితరులు కూడా హాజరయ్యారు.
ఈరోజు రేవంత్ రెడ్డితో బాటు కాంగ్రెస్ లో చేరిన తెదేపా నేతలలో వేం నరేందర్ రెడ్డి, సీతక్క, బోడ జనార్ధన్ (చెన్నూరు), సిహెచ్. విజయ రమణరావు (పెద్దపల్లి), అరికల నర్సరెడ్డి (నిజామాబాద్ రూరల్), ఎస్. బాపురావు (బోద్), మేడిపల్లి సత్యం (చొప్పదండి), శశికళ యాదవ్ (పటాన్ చేరు), హరి ప్రియ నాయక్ (ఇల్లందు), పటేల్ రమేష్ రెడ్డి (సూర్యాపేట), కే.సత్యనారాయణ (మానకొండూరు), రాజారం యాదవ్ (ఆర్మూరు), బిల్యా నాయక్ (దేవరకొండ), తోటకూర జానయ్య మొదలైనవారున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ జెయుసికి చెందిన దొమ్మాటి సాంభయ్య (వరంగల్), జరు ఎల్లన్న, బాల లక్ష్మీ, భాస్కర్, మధుసూదన్ రెడ్డి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈరోజు మధ్యాహ్నం 3గంటలకు ఉత్తం కుమార్ రెడ్డి, కుంతియా, రేవంత్ రెడ్డి తదితరులు మీడియా సమావేశం నిర్వహించనున్నారు.