కాళేశ్వరానికి లైన్ క్లియర్

తెలంగాణాకు వరప్రదాయినిగా మారనున్న కాళేశ్వరం ప్రాజెక్టును తెరాస సర్కార్ శరవేగంగా పూర్తిచేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తుంటే, మరోపక్క దానిని అడ్డుకొనేందుకు కొన్ని రాజకీయపార్టీలు కూడా విఫలయత్నాలు చేస్తున్నాయి. ఆ అవరోధాలను అన్నిటినీ ఒకటొకటిగా ఎదుర్కొంటూ తెరాస సర్కార్ ముందుకు సాగుతోంది. 

రాష్ట్ర సాగునీటిశాఖా మంత్రి హరీష్ రావు, ఆ శాఖ అధికారులు చేసిన ప్రయత్నాల వలన కాళేశ్వరం ప్రాజెక్టుకు తగినంత నీటి లభ్యత ఉందని గుర్తించి ఆ మేరకు అనుమతిని మంజూరు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన 282.3 టిఎంసిల నీటి లభ్యత మేడిగడ్డ బ్యారేజి వద్ద ఉందని అంగీకరిస్తూ కేంద్ర జలసంఘం హైడ్రాలజీ డైరెక్టరేట్ దృవీకరించింది. ఆ విషయాన్నీ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖకు కూడా ఒక లేఖ ద్వారా తెలియజేసింది. కొన్ని వారాల క్రితమే ఈ ప్రాజెక్టుకు అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ మొదటిదశ పనులకు అనుమతి మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 18.25 లక్షల ఎకరాలకు నీటిని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది.