తెదేపాలో రాజీనామాల పర్వం షురూ?

తెలంగాణాలో తెదేపాలో వరుస రాజీనామాల పర్వం మొదలైంది. రేవంత్ రెడ్డి తరువాత వేం నరేందర్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తరువాత ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క కూడా తెదేపాకు గుడ్ బై చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు డిల్లీ చేరుకొన్నారు. ఈరోజు ఇంకా అనేకమంది తెదేపాకు రాజీనామాలు చేసే అవకాశముంది. రేవంత్ రెడ్డి తనతో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేవారి జాబితాలను సమర్పించారని మీడియాలో వార్తలు వచ్చాయి. 

ఆ జాబితాలో బోడ జనార్ధన్ (చెన్నూరు), అరికల నర్సరెడ్డి (నిజామాబాద్ రూరల్), కె గంగాధర్ (బాన్స్వాడా), ఎస్. బాపురావు (బోద్), గంగాధర్ గౌడ్ (నిజామాబాద్), కే భూపాల్ రెడ్డి (నల్లగొండ), రావి శ్రీనివాస్ (కాగజ్ నగర్), రాజారం యాదవ్ (ఆర్మూరు), భట్టి జగపతి (మెదక్), దొమ్మాటి సాంభయ్య (వరంగల్), గండు సావిత్రమ్మ (మహబూబ్ నగర్), మేడిపల్లి సత్యం (చొప్పదండి), ఎం.కశ్యప్ రెడ్డి (హుజూరాబాద్), మద్దెల రవీందర్ (ధర్మపురి), డి అనసూయ (ములుగు), హరి ప్రియ నాయక్ (ఇల్లందు), సుబాష్ రెడ్డి (ఎల్లారెడ్డి), కే.సత్యనారాయణ (మానకొండూరు), శశికళ యాదవ్ (పటాన్ చేరు), బిల్యా నాయక్ (దేవరకొండ), పటేల్ రమేష్ రెడ్డి (సూర్యాపేట), చుక్కల ఉదయ్ చందర్ (మహబూబ్ నగర్),చారకొండ వెంకటేష్ (అచ్చం పేట), పి శ్రీనివాస్ రెడ్డి (కొల్హాపూర్), పొట్ల నాగేశ్వర్ రావు తదితరులున్నారు. వీరందరూ కూడా తెదేపాకు గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం.